చంద్రబాబు పనైపోయింది!
కరీంనగర్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని అయిపోయినట్లేనని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 'ఓటుకు కోట్లు' కేసులో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ బుధవారం రాత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నిన్న ఆరుగంటల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో కేవలం తనను ఎలా ఇరికించాలన్న ఆలోచనలే చేశారని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. చివరకు తన భాష మీద, తాను మాట్లాడిన అంశాల మీద వివాదం రేపాలని చూస్తున్నారని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.