కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ | acb dg ak khan meets cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ

Published Tue, Jun 16 2015 10:32 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ - Sakshi

కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌రావుతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సీపీ మహేందర్ రెడ్డి సహా ఆయన ...కేసీఆర్తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సర్కార్ ఓటుకు నోటుపై కేంద్రానికి నివేదిక పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఓటుకు నోటు వ్యవహారంపై సీఎం కేసీఆర్ నిన్న గవర్నర్ను కలిసి నివేదిక అందించిన విషయం విదితమే.  

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డీజీపీ రాముడు, ఎంపీ సుజనా చౌదరి, యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement