కోర్టు ఆదేశాలతోనైనా కేసీఆర్.. ఓటుకు కోట్లు కేసును తేల్చాలని ఎమ్మెల్సీ రంగారెడ్డి చెప్పారు.
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకం అని చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏసీబీ కోర్టు ఆదేశాలతోనైనా ఓటుకు కోట్లు కేసును తేల్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేయం ఉందని అందరికీ తెలిసిందే'ని అని ఆయన అన్నారు.
ఈ కేసు విషయంలో అప్పట్లో రెండు రాష్ట్రాల సీఎంలు సవాళ్లు విసురుకున్నారనీ, ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం రాజీపడ్డారని ఎమ్మెల్సీ రంగారెడ్డి విమర్శించారు.