'బాబు, కేసీఆర్ డ్రామాలాడుతున్నారు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ విచారణ తీరుపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎందుకు విచారించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కోటుకు కోట్లు కేసులో పెద్దవారిని వదిలేసి చిన్నవారిని ఎందుకు విచారిస్తున్నారని జీవన్ రెడ్డి తప్పుపట్టారు. ఇది కచ్చితంగా క్విడ్ ప్రోకో అని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఎవరు వారధిగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు వారి తప్పులు కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు ఆడుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఏసీబీ విచారణ నిష్పక్షపాతంగా జరగడంలేదనే భావన ప్రజల్లో కనబడుతోందని అన్నారు.