బాబును వెంటనే అరెస్టుచేసి, జైలుకు పంపాలి! | bhumana fires on chandrababu over cash for vote comment | Sakshi
Sakshi News home page

బాబును వెంటనే అరెస్టుచేసి, జైలుకు పంపాలి!

Published Fri, Jun 23 2017 1:34 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

బాబును వెంటనే అరెస్టుచేసి, జైలుకు పంపాలి! - Sakshi

బాబును వెంటనే అరెస్టుచేసి, జైలుకు పంపాలి!

హైదరాబాద్‌: తాను తలుచుకుంటే ఓటుకు రూ. ఐదువేలు ఇవ్వగలనన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. సీఎం చంద్రబాబు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు రూ. ఐదువేలు ఇవ్వగలనన్న చంద్రబాబును..  ఈ వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అరెస్టు చేసి, జైలుకు పంపాలని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.

గతంలో రూ. ఐదు కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ కొనుగోలు చేయాలని చూసిన చంద్రబాబు.. ఇప్పుడు ఓటర్లను కూడా రూ. 5వేల చొప్పున కొనుగోలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల అంటే చంద్రబాబు ఓటర్లుగానే కనిపిస్తున్నారని, ఓటు ఉన్నవాడే మనిషి అన్న ఆలోచనతో ఆయన బతుకుతున్నారని భూమన ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement