ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్‌ ఇస్తారా?:వైఎస్‌ జగన్‌ | challenge is not only one side, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

నా ఛాలెంజ్‌ కి ప్రభుత్వం పారిపోతోంది: వైఎస్‌ జగన్‌

Published Fri, Mar 24 2017 1:42 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్‌ ఇస్తారా?:వైఎస్‌ జగన్‌ - Sakshi

ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్‌ ఇస్తారా?:వైఎస్‌ జగన్‌

అమరావతి: ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అసంతృప్తి వ‍్యక్తం చేశారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మా‍ట్లాడుతూ....సభలో ఒక్క ఛాలెంజ్‌కే రూలింగ్‌ ఇస్తారా, తమ ఛాలెంజ్‌లపై రూలింగ్‌ ఇవ్వరా అని ప్రశ్నించారు. దేనికైనా ధర్మం, న్యాయం ఉండాలని పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరామని, కానీ స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని అనర్హత వేటు పడకుండా చూస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు.

అనర్హత వేటు వేస్తే ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామన్న సవాల్‌కు స్పందించలేదని, ఓటుకు కోట్లు కేసులో మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మి అనే వాయిస్‌ చంద్రబాబుదో, కాదో చెప్పాలని సవాల్‌ విసిరామని, దానిపై ఇప్పటివరకూ స్పందనలేదన్నారు.  ప్రతిపక్షం సవాళ్లపై స్పందించరని, అదే అధికారపక్షం సవాల్‌పై మాత్రం స్పందించాలని ఎదురు దాడి చేయడం సరికాదని వైఎస్‌ జగన్‌ అన్నారు. స్పీకర్‌ కూడా అధికారపక్షం వైపే ఉన్నారన్నారు.

చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ కలిసి తనపై తప్పుడు కేసులు వేయించారని, అందుకే అవిశ్వాసం సమయంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కార్‌ను చంద్రబాబు కాపాడారని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. తన ఆస్తి లక్ష కోట్లు అని ఒకసారి, రూ.43వేల కోట్లని మరోసారి చెబుతున్నారని, అందులో 10శాతం ఇవ్వాలని తాను సవాల్‌ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. తన సవాళ్లపై స్పందించేందుకు ఇంతవరకూ ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. మళ్లీ అవే ఆరోపణలు తనపై చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎప్పుడైనా వన్‌సైడ్‌ ఛాలెంజ్‌ ఉండదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారంలో తాను చేసిన సవాల్‌కు సర్కార్‌ నుంచి స్పందనే లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement