ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీ పిటిషన్పై వాదనలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీ పిటిషన్పై వాదనలు ప్రారంభమయ్యాయి. బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ను విచారిస్తోంది.
ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్కు ఆదేశించారు. సండ్ర తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. సండ్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు పురోగతిని అడ్డుకుంటారని, 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కస్టడీ పిటిషన్ను దాఖలు చేసింది.