సండ్ర కస్టడీ పిటిషన్పై తీర్పు సా. 4 గంటలకు | ACB court postpone verdict in MLA sandra venkata veeraiah custody petition | Sakshi
Sakshi News home page

సండ్ర కస్టడీ పిటిషన్పై తీర్పు సా. 4 గంటలకు

Published Wed, Jul 8 2015 12:45 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

సండ్ర కస్టడీ పిటిషన్పై తీర్పు సా. 4 గంటలకు - Sakshi

సండ్ర కస్టడీ పిటిషన్పై తీర్పు సా. 4 గంటలకు

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీ పిటిషన్పై తీర్పును కోర్టు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఇదే కేసులో సండ్ర బెయిల్ పిటిషన్పై తీర్పును రేపటికి వాయిదా వేసింది.  బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ను విచారించింది.

ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్కు ఆదేశించారు. సండ్ర తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. సండ్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు పురోగతిని అడ్డుకుంటారని, 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కౌంటర్ పిటిషన్ను దాఖలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement