
ఏపీ సచివాలయానికి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే
అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర తాజా పరిణామాలపై పలువురితో చర్చించారు. ఓటుకు కోట్లు కేసులో సండ్ర వీరయ్య అయిదో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.