దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అవుతోంది. ఈ వ్యవహారంలో స్వయంగా జోక్యం చేసుకొని ప్రత్యేకంగా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు పెట్టడంతోపాటు అనర్హత వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నదని సమాచారం. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఎన్నికల సంఘం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలుగా ఏసీబీ సమర్పించిన 14 ఆడియో, వీడియో టేపుల కాపీలను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ సీఈసీ తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు కూడా ఈ టేపులు అసలువా..