
‘చంద్రబాబు స్టే తెచ్చుకోవడం సరికాదు’
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీమంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు సిద్ధపడాలని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ 17సార్లు స్టే ఎందుకు తెచ్చుకున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. నిప్పునని చెప్పుకునే బాబు స్టే కోసం ఎందుకు హైకోర్టును ఆశ్రయించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటోందని, డీపీఆర్ లేకుండానే టెండర్లు పిలుస్తున్నారని ఆయన విమర్శించారు.