సెల్ పోయింది.. ఓటుకు కోట్లు కేసులో నోటీసు
హైదరాబాద్: రెండేళ్ల క్రితం సెల్ఫోన్ పోగొట్టుకున్న ఓ వ్యక్తికి ఏసీబీ నోటీసు వచ్చింది. ఈ నోటీస్ చూసి అతనితో పాటు కుటుంబ సభ్యులు షాకయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి రాములు అనే వ్యక్తికి ఏసీబీ నోటీసు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. రాములు పేరుతో ఉన్న సిమ్ను వాడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. అయితే ఓటుకు కోట్లు కేసులో తనకెటువంటి సంబంధాలు లేవని రాములు చెబుతున్నాడు. హైదరాబాద్లో రెండేళ్ల క్రితం సెల్ పోగొట్టుకున్నానని చెప్పాడు. ఆ ఫోన్ ఎవరికి దొరికొందో.. ఆ నెంబర్తో ఎవరు ఫోన్ చేశారో తనకు తెలియదని అన్నాడు. వాస్తవమేంటన్నది ఏసీబీ విచారణలో తేలాల్సివుంది.