గవర్నర్తో కేసీఆర్, ఏసీబీ డీజీ భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, తెలంగాణ అడ్వకేజ్ జనరల్ రామకృష్ణారెడ్డి మంగళవారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఓటుకు కోట్లు కేసు పునర్విచారణ సందర్భంగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గవర్నర్ను కలిశారు. వారిద్దరి మధ్య సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓటుకు కోట్లు కేసు గురించి చర్చించినట్లు సమాచారం.
కాగా సీఎం అక్కడ ఉన్న సమయంలోనే ఏసీబీ డీజీతో పాటు తెలంగాణ అడ్వకేట్ జనరల్ ...గవర్నర్ను కలిశారు. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు తీరుతెన్నులను ఏకే ఖాన్ ...గవర్నర్కు వివరించారు. గతంలో మత్తయ్యపై కేసును హైకోర్టు కొట్టివేయగా, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన అంశాలను వివరించారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసు విచారణకు రానుందని ఏకేఖాన్ తెలిపారు. కాగా ఓటుకు కోట్లు కేసు విషయంలో సీఎం కేసీఆర్ రాజకీయంగా తనకు చెడ్డపేరు రాకూడదన్న భావనతో ఉన్నట్లు సమాచారం.
కాగా ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించడంతో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఏవిధంగా ముందు కెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.