స్థానిక సంస్థల సంరంభం శనివారంతో ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకొని టీఆర్‌ఎస్ కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం 32 జిల్లాల్లో జెడ్పీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కో ఆప్షన్ పదవులన్నింటినీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 436 మండల పీఠాలను గెలుచుకుని సత్తా చాటింది.