mptc candidate
-
‘కూన’ గణం.. క్రూర గుణం
వరుసగా ఎదురవుతున్న పరాజయాలతో కాలు నిలవని అసహనం.. ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్న పరాభావాలను తట్టుకోలేని మనస్తత్వం.. ఏళ్ల తరబడి చలాయించిన ఆధిపత్యానికి గండి పడుతూ ఉంటే.. భవిష్యత్తులో తలవంచి నిలబడే పరిస్థితి కళ్లెదుట కనబడుతూ ఉంటే.. ఏం చేయాలో పాలుపోని భయం. ఇవన్నీ కొందరిలో కక్షలను రెచ్చగొడుతున్నాయి. కార్పణ్యాలను ఎగదోస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవల స్థానిక పోరు వరకు ప్రతి దశలోనూ వెక్కిరిస్తున్న ఫలితాలు కసిని ప్రేరేపిస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లోనూ అపజయం అనివార్యమయ్యేట్టు కనిపిస్తూ ఉంటే.. నాయకులమంటూ తెగ మిడిసిపడ్డ వారిలో ఈర్ష్యాద్వేషాలు బుసకొడుతున్నాయి. అవి విషమించి దాడులకు దారిచూపుతున్నాయి. గురువారం ఎన్నికల తరువాత ఇటువంటి అరాచక పరిస్థితులే అగుపించి ప్రజలను నిర్ఘాంతపోయేలా చేశాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ అనుచర గణాలు గురువారం రాత్రి పెనుబర్తి ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మరళీ కృష్ణ ఇంటిపై దౌర్జన్యానికి దిగడం.. అతడిని బెదిరించి, భయపెట్టి తీవ్రంగా హెచ్చరించడమే కాక, విలువైన ఆస్తులను ధ్వంసం చేయడం చూస్తూ ఉంటే.. పరిస్థితులు ఎటు దారి తీస్తాయోనన్న భయాందోళనలు అందరిలో ముప్పిరిగొంటున్నాయి. పొందూరు: పరిషత్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో.. పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీకృష్ణను లక్ష్యంగా చేసుకుని మాజీ విప్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ వర్గీయులు మరణాయుధాలు, కర్రలతో దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఇప్పటికే సొంత గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన రవికుమార్ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఓటమి తప్పదని వచ్చిన సంకేతాలను జీర్ణించుకోలేక గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై, పంచాయతీ కార్యాలయంపై దాడి చేశారు. ఓటమిని ఎదుర్కోలేక రవికుమార్ దాడులకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పెనబర్తి అలమాజీపేటకు చెందిన తమ వర్గీయులతో కూన రవికుమార్ నేరుగా ఎంపీటీసీ అభ్యర్థి నివాసంపై దాడికి పూనుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వాగ్వాదానికి దిగారు. అదే అదునుగా కొంతమంది మురళీ ఇంటిపై దాడిచేసి ఏసీలు, గృహోపకరణాలను ధ్వంసం చేశారు. ఖరీదైన రెండు కార్లను పగలగొట్టారు. దీంతో భయాందోళనకు గురైన మురళీ, భార్య ఝాన్సీరాణి(సర్పంచ్) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమకు ప్రాణభయం ఉందని తెలిపారు. తమతో పాటు వైఎస్సార్సీపీ ముఖ్య అనుచరులను చంపేస్తామని భయపెడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో అసహనానికి గురైన రవికుమార్ హత్యలు చేయించేందుకు ప్రయత్నించడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినప్పటికీ రక్షణ లేకుండాపోయిందని వాపోయారు. ఘర్షణలకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీతో కూన వాగ్వాదం కారులో పెనుబర్తి నుంచి వెళ్తున్న కూన రవికుమార్‌ను డీఎస్పీ మహేంద్ర నిలువరించారు. దీంతో తనను ఆపినందుకు డీఎస్పీతో ఆయన వాగ్వాదానికి దిగారు. రెండేళ్లలో అధికారంలోకి వస్తామని, ఎక్కడున్నా నిన్ను గుర్తుపెట్టుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు. చదవండి: పరిషత్ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు కొటియాలో ఒడిశా దౌర్జన్యకాండ.. -
ఓటుకు నోట్లు ; ఇదేమి ఆదర్శంరా నాయనా..!
-
ఓటుకు నోట్లు ; ఇదేం ఆదర్శంరా బాబూ..!
సాక్షి, మంచిర్యాల : స్థానిక సంస్థల సంరంభం శనివారంతో ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకొని టీఆర్ఎస్ కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం 32 జిల్లాల్లో జెడ్పీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కో ఆప్షన్ పదవులన్నింటినీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 436 మండల పీఠాలను గెలుచుకుని సత్తా చాటింది. ఇక మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం లింగయ్య పల్లెలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ తరపున ఎంపీటీసీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మాదాడి హన్మంతరావు అనే వ్యక్తి ఓటమిపాలయ్యారు. దీంతో ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలామంది తాము తీసుకున్న డబ్బుల్ని తిరిగిచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓటుకు నోట్లు పంచిన ఓ వ్యక్తి తిరిగి చెల్లించమనడం.. ఇదే మా ఆదర్శం అంటూ ప్రజలు స్పందించడం భలే యావ్వారం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. -
ఓటమి భయంతో ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యయత్నం
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అదృశ్యం
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్‌రెడ్డి నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి నాగేష్ అదృశ్యమయ్యారు. ఆయన రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం రమేష్ నాయుడు సోదరుడు సురేష్ నాయుడు కిడ్నాప్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్ నాయుడే నాగేష్‌ను కిడ్నాప్ చేశారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
వైసీపీకి ఓటుతో సీమాంధ్ర ప్రగతి
ఆగర్తిపాలెం (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీకి ఓటు వేయడం ద్వారా సీమాంధ్ర ప్రగతికి తోడ్పడతారని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన నాటి స్వర్ణయుగం ఆయన తనయుడైన జగన్మోహన్రెడ్డికే సాధ్యమని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిని చిట్టూరి కనకలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి పడవల సునీల్బాబుకి మద్దతుగా శనివారం ఆగర్తిపాలెంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్ల విద్యకోసం అమ్మఒడి పథకం పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డ్వాక్రా రుణాల రద్దు, రైతులకు ధరల నియంత్రించేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతాయని, 108, 104, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కొత్త హంగులతో పునర్జీవం పోసుకుంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆగర్తిపాలెం దళితవాడ, బీసీ, ఓసీ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. పార్టీ మండల కన్వీనర్ ఎం.మైఖేల్‌రాజు, ఆగర్రు సొసైటీ అధ్యక్షుడు మేడిది జాన్ డేవిడ్‌రాజు, చిట్టూరి ఏడుకొండలు, పోలిశెట్టి శ్రీనివాస్, మేకా రామకృష్ణ, నడపన గోవిందరాజులనాయుడు, కైలా నరసింహరావు పాల్గొన్నారు.