వైఎస్సార్ సీపీకి ఓటు వేయడం ద్వారా సీమాంధ్ర ప్రగతికి తోడ్పడతారని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు పేర్కొన్నారు.
ఆగర్తిపాలెం (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీకి ఓటు వేయడం ద్వారా సీమాంధ్ర ప్రగతికి తోడ్పడతారని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన నాటి స్వర్ణయుగం ఆయన తనయుడైన జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిని చిట్టూరి కనకలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి పడవల సునీల్‌బాబుకి మద్దతుగా శనివారం ఆగర్తిపాలెంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్ల విద్యకోసం అమ్మఒడి పథకం పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డ్వాక్రా రుణాల రద్దు, రైతులకు ధరల నియంత్రించేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతాయని, 108, 104, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కొత్త హంగులతో పునర్జీవం పోసుకుంటాయని చెప్పారు.
ఈ సందర్భంగా ఆగర్తిపాలెం దళితవాడ, బీసీ, ఓసీ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. పార్టీ మండల కన్వీనర్ ఎం.మైఖేల్‌రాజు, ఆగర్రు సొసైటీ అధ్యక్షుడు మేడిది జాన్ డేవిడ్‌రాజు, చిట్టూరి ఏడుకొండలు, పోలిశెట్టి శ్రీనివాస్, మేకా రామకృష్ణ, నడపన గోవిందరాజులనాయుడు, కైలా నరసింహరావు పాల్గొన్నారు.