సాక్షి, శ్రీకాళహస్తి : సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు సమయంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే మాత్రం లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. స్టేజ్–2 అధికారి సమక్షంలో లాటరీ తీస్తారు. ముందుగా ఆ ఇద్దరు అభ్యర్థుల పేర్లు (ఒక్కొక్క అభ్యర్థి పేరు ఐదు) చీటిల్లో రాస్తారు. అవి ఒకే రంగు, ఒకే సైజు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. చీటిల్లో పేర్లు కూడా కనిపించకుండా మొత్తం పది చీటిలను బాగా చుట్టి ఒక డబ్బాలో వేస్తారు. ఆ డబ్బాను అటు ఇటు బాగా తిప్పిన తర్వాత అధికారి ఒక చీటిని బయటకు తీస్తారు. అందులో ఎవరు పేరు వస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తారు.
ఒకరి ఓటు మరొకరు వేస్తే..
చిత్తూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఒకరి ఓటు మరొకరు వేస్తే, ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇచ్చే ఓటును టెండర్ ఓటు అంటారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు ఓటు వేయడానికి వచ్చే ముందు ఎవరైనా వేరే వ్యక్తి తన ఓటును వేసి ఉంటే, అసలు ఓటరు∙గుర్తింపు నిజమైతే అతనికిచ్చే ఓటును టెండర్ ఓటు అంటారు. అలాంటి పరి స్థితి ఎక్కడైనా తలెత్తితే పీఓ ఫారం –24 పూరించి, ఆ వ్యక్తి దగ్గర సంతకం, వేలిముద్ర తీసుకోవాలి. టెండర్ ఓటు కలి్పంచే వారికి బ్యాలెట్ పేపర్‌లో చి వరి నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరి బ్యాలెట్ పేపర్‌లో కౌంటర్ ఫైల్, బ్యాలెట్ పేపర్‌లో టెండర్ బ్యాలెట్ పేపర్ అని వెనుక వైపు పీఓ రాయాల్సి ఉంటుంది. మార్క్ కాపీలో నోట్ చేయకూడదు. ఆ ఓటును బ్యాలెట్ బాక్సులో వేయకుండా ప్రత్యేకమై న కవర్‌లో ఉంచి రిటరి్నంగ్ అధికారికి అందజేయాలి. టెండర్ ఓట్లు 2 శాతం మించితే ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
చదవండి: పంచాయతీ బరిలో స్పీకర్ సతీమణి
పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే..
Comments
Please login to add a commentAdd a comment