హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు కీలక వ్యక్తులతో పాటు వారి దగ్గర పనిచేస్తున్న వారిని విచారిస్తున్నారు. శుక్రవారం టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కారు డ్రైవర్ దేవేందర్తో పాటు పనిమనిషి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు.
గత రెండు రోజులు ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ను విచారించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వేం నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు విచారించారు.
'వేం నరేందర్ సహాయకులను విచారిస్తున్న ఏసీబీ'
Published Fri, Jul 17 2015 5:14 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement