vem narender reddy
-
మహానాడు వేదికగా.. ఓటుకు కోట్లు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బు తో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. తనను ఈ కేసులో అక్రమంగా ఇరి కించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై ఏసీబీ ఇటీవల కౌంట ర్ దాఖలు చేసింది. సండ్ర వాదనను ఏసీబీ తోసిపుచ్చింది. రేవంత్‌రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా ఈ కుట్రలో భాగస్వామిగా మారారని పేర్కొంది. శంషాబాద్ నోవాటెల్‌లో ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని తెలిపింది. అలాగే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్‌లోనూ సండ్ర ప్రమే యం స్పష్టంగా ఉన్నాయంది. సండ్ర పాత్రపై ఆధారాలున్న నేపథ్యంలోనే.. 2015, జూలై 6న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, తర్వాత అన్ని ఆధారాలతో 2017, ఫిబ్రవరి 18న అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశామని వివరించింది. ఎఫ్ఐఆర్, దర్యాప్తు తర్వాత దాఖలు చేసిన చార్జి షీట్లో ఆయన్ను చేర్చలేదని, తర్వాత లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా సండ్ర పాత్రపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది. డబ్బు తెచ్చింది ఉదయసింహనే... రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్.. సీఫ్టెన్సన్ను ప్రలోభపెట్టారని ఏసీబీ వివరించింది. స్టీఫెన్సన్కు అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చేం దుకు టీడీపీ ఎమ్మెల్యేలు బస చేసిన శంషాబాద్ నోవాటెల్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో రేవంత్‌రెడ్డి బయలు దేరారని తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు 2015, మే 31న మధ్యాహ్నం 4.40 గంటల ప్రాంతంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారు (మహీంద్రా స్కార్పియో–ఏపీ 09 సీవీ 9939) లో వచ్చారని వెల్లడించింది. వారు వచ్చిన కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారు (టీఎస్10యుఏ 1031)లో రూ.50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్‌మెంట్‌కు వచ్చారని ఏసీబీ వివరించింది. తెచ్చిన డబ్బును సంచిలో నుంచి తీసి టీపాయ్‌పై పెట్టింది కూడా ఉదయసింహనే అని తెలిపింది. ఈ సమయంలో వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలని మరోసారి రేవంత్‌రెడ్డి.. స్టీఫెన్సన్ను కోరారని, మిగిలిన రూ.4. 5 కోట్లను ఓటింగ్ తర్వాత ఇస్తామని వాగ్ధానం చేశారని పేర్కొంది. ‘డబ్బు ఎక్కడి నుంచి తేవా లని చెప్పేందుకు నాగోలు చౌరస్తాకు రమ్మని ఉదయసింహకు రేవంత్‌రెడ్డి సూచించారు. మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి వేం కృష్ణకీర్తన్ రెడ్డి నుంచి సీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రూ.50 లక్షలను తీసుకురావాలని రేవంత్‌రెడ్డి.. ఉదయసింహకు చెప్పారు. ఈ కేసులో ఉదయసింహ పాత్ర ను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నా యి. ఓటుకు కోట్లు కేసు నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలి’అని ఏసీబీ నివేదించింది. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణలో భాగం గా శుక్రవారం రేవంత్‌రెడ్డి, సండ్ర తదితరులు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరగా న్యాయమూర్తి అనుమతించారు. తదుపరి విచా రణను ఈనెల 27కి వాయిదా వేశారు. -
ఆ డబ్బు ఎవరిచ్చారు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు – కోట్లు’కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే డబ్బు ఎక్కడ నుంచి వచ్చిం దన్న విషయంపై టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి ఆయన కుమారులను ఈడీ విచారించిన సం గతి తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ విచారణకు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందే తయారు చేసిన ప్రశ్నల జాబితా(బ్యాంకు స్టేట్మెంట్లు, ఏసీబీ ఇచ్చిన అధారాలు)ను ఆయన ముందుంచి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసిం ది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచంగా ఇవ్వజూపిన రూ.50 లక్షలను మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి చేరవేసారని ఉదయసింహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ వీడియోలో త్వరలోనే మరో రూ.4.5 కోట్లు ఇస్తామని రేవంత్ చెప్పారు. మిగతా నగదు ఎవరు ఇచ్చేవారని ప్రశ్నించి నట్లు సమాచారం. దీనిపై తొలుత పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ఉదయ సింహ నుంచి తరువాత విచారణలో పలు కీలక అంశాలు ఈడీ డైరెక్టర్ రాజశేఖర్ బృందం రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు 9 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ.. 2015 మేలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచంగా ఎరవేశారు. ముందస్తు సమాచారంతో మాటువేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,సెబాస్టియన్, ఉదయసింహా, మత్తయ్యలపై ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహా ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదా జరిపిన సంగతి తెలిసిందే. తరువాత ఈకేసును ఏసీబీ అధికారులు ఈడీకి బదిలీ చేశారు . ఈ కేసులో మత్తయ్య, సెబాస్టియన్, ఉదయసింహా, రేవంత్‌రెడ్డితోపాటు మరో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి అతని కుమారులను కూడా ఈడీ విచారించింది. నేడు ఈడీ ముందుకు రేవంత్‌రెడ్డి ఈ కేసులో ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. 19న విచారణకు రావాలంటూ రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన ప్రశ్నావళిని ఈడీ అధికారులు ముందే సిద్ధం చేసినట్లు సమాచారం. తాజాగా ఉదయసింహా, వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారులు ఇచ్చిన సమాధానాల ఆధారంగా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తొలి నుంచి రేవంత్‌రెడ్డి అన్నీ తానై నడిపించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, స్టీఫెన్సన్లనూ విచారణకు రావాలని ఈడీ పిలిచే అవకాశముంది. -
‘ఓటుకు కోట్లు’లో బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక నేతల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారుల్నీ ఈడీ అధికారులు మంగళవారం ఏడున్నర గంటల పాటు విచారించారు. ఈ నెల 18న ఉదయ్‌సింహ, 19న రేవంత్‌రెడ్డిలను విచారించనున్నారు. రూ.50 లక్షల కేంద్రంగానే విచారణ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి 2015లో చంద్రబాబు కుట్ర పన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఇస్తామని బేరసారాలు జరిపించారు. తర్వాత అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇప్పటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి స్టీఫెన్సన్ వద్దకు వెళ్లి రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన భారీమొత్తం పూర్వాపరాలు తేల్చాలంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అప్పుడే ఈడీకి లేఖ రాసింది. దీంతో ఆ రూ.50 లక్షలతోపాటు మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడివనే విషయాన్ని తెలుసుకునే దిశగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దీనికి సంబంధించే నాటి ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులకు ఈ నెల 1న నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి ఏడు గంటల వరకు ముగ్గురినీ వేర్వేరుగా ప్రశ్నించిన అధికారుల బృందం.. పలు కీలక అంశాలను తెలుసుకుంది. వీరి నుంచి కొన్ని డాక్యుమెంట్లను సైతం తీసుకుంది. ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డితోపాటు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరందరినీ విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉదయ్‌సింహ, రేవంత్‌రెడ్డిలకు నోటీసులు ఇవ్వగా.. మిగిలిన వారికి త్వరలో ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. అది చంద్రబాబు వాయిస్ అని ఇప్పటికే నిర్ధారించారు. మరోవైపు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రాల్లో 22 చోట్ల చంద్రబాబు పేరు చేర్చారు. నా కుమారుల్ని పిలవడం బాధాకరం... ఈడీ విచారణ ముగిసిన తర్వాత వేం నరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నోటుకు కోట్లు కేసుతో ఎటువంటి సంబంధం లేని తన కుమారుల్ని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈడీ) విచారణకు పిలవడం బాధాకర మని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. వారు కోరిన డాక్యుమెంట్లు సైతం అందించాను. మరోసారి పిలిచినా హాజరవుతాను. రేవంత్‌రెడ్డి సైతం త్వరలో విచారణకు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కేంద్రానికి అప్పగించినట్లు అనిపిస్తోంది’అని నరేందర్ పేర్కొన్నారు. నరేందర్‌రెడ్డికి ‘ముఖ్య’మైన కాల్స్..? ఈడీ విచారణ ముగించుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే వేం నరేందర్‌రెడ్డికి కొన్ని ‘ముఖ్య’మైన ఫోన్‌కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ప్రధానంగా ఏ విషయంపై గురిపెట్టారు? ఎలాంటి ప్రశ్నలు సంధించారు? తదితర వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు ప్రముఖుల ప్రమేయం సైతం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని గమనించిన ‘ముఖ్య’నేతలు, ‘చిన’నేతలకు సంబంధించిన వ్యక్తులు ఈడీ విచారణ, దర్యాప్తు తీరులతో పాటు ప్రశ్నావళినీ వేం నరేందర్‌రెడ్డి నుంచి సేకరిస్తున్నారని తెలిసింది. -
శాంతిభద్రతల కోసమే రేవంత్ అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో ఎక్కడా కూడా చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎన్నికల సమయంలో వికారాబాద్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగానే రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న సభ లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందువల్ల అధికారిక సీలు అందుబాటులో లేకపోయిందని వివరించారు. అదుపులోకి తీసుకునే ముందు బయటకు రావాలని రేవంత్‌ను పలుమార్లు పిలిచామని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో గేట్లు పగులగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్‌తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని, వారికి రేవంత్ అరెస్ట్‌కు దారి తీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు కోరగా నిరాకరించారని ఆమె తెలిపారు. పోలీసులు చట్ట విరుద్ధంగా రేవంత్‌ను నిర్బంధించారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి అవకాశం ఇచ్చి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
రేవంత్ రెడ్డి వర్గానికి షాక్
-
'వేం నరేందర్ సహాయకులను విచారిస్తున్న ఏసీబీ'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు కీలక వ్యక్తులతో పాటు వారి దగ్గర పనిచేస్తున్న వారిని విచారిస్తున్నారు. శుక్రవారం టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కారు డ్రైవర్ దేవేందర్‌తో పాటు పనిమనిషి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు. గత రెండు రోజులు ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌ను విచారించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వేం నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు విచారించారు. -
రెండో రోజు కృష్ణ కీర్తన్ ను విచారించిన ఏసీబీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌ను ఏసీబీ అధికారులు వరుసగా రెండో రోజూ విచారిస్తున్నారు. గురువారం ఆయన ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఏసీబీ అధికారులు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 కృష్ణను సుదీర్ఘంగా విచారించారు. కృష్ణకీర్తన్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ సింహాలను కలిపి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. బుధవారం కూడా ఏసీబీ అధికారులు కృష్ణను విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, ఉదయసింహ, సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డిలను ఏసీబీ ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. -
'టీడీపీ నేతలతో వ్యక్తిగత పరిచయాలు లేవు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కృష్ణను దాదాపు 8 గంటల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విడిచిపెట్టారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు కృష్ణ కీర్తనను కీలక ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈ కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కృష్ణ కీర్తన్ పేరు మీదున్న ఒక సిమ్ కార్డుకు నిందితుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చిన అంశంపై ఏసీబీ ఆరా తీసినట్టు సమాచారం. కాగా రాజకీయాలు, ఆర్థిక అంశాలను తండ్రి తనతో పంచుకోరని కృష్ణ ఏసీబీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ నాయకులతో వ్యక్తిగత పరిచయాలు లేవని, తమ ఇంటికి వచ్చినపుడు కొందరు నాయకులను చూడటం తప్ప ప్రత్యేకించి వారితో మాట్లాడలేదని ఆయన ఏసీబీ విచారణలో వెల్లడించినట్టు సమాచారం. విచారణాంతరం కృష్ణ కీర్తన్ ఇంటికి వెళ్లారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. వేం నరేందర్ రెడ్డి గెలుపుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. -
ఏసీబీ ఎదుట హాజరైన కృష్ణ కీర్తన్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ బుధవారం ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు మంగళవారం సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఏసీబీకి లభించిన ఆధారాలతో పాటు కస్టడీలో నిందితులు వెల్లడించిన అంశాల్లో కృష్ణకీర్తన్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మే 31న నామినేటెడ్ స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్, ఉదయసింహలు కృష్ణకీర్తన్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, ఉదయసింహ, సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్యలను ఏసీబీ ప్రశ్నించింది. -
తెరపైకి కొత్త ముఖాలు!
‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌కు ఏసీబీ నోటీసులు ఓటుకు డబ్బు తీసుకోవడానికి సిద్ధమైన వారిపైనా దృష్టి హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ.. ఈ వ్యవహారంలో మరికొం దరి ప్రమేయమున్నట్లుగా గుర్తించింది. అందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌కు మంగళవారం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకల్లా తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఏసీబీకి లభించిన ఆధారాలతో పాటు కస్టడీలో నిందితులు వెల్లడించిన అంశాల్లో కృష్ణకీర్తన్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మే 31న నామినేటెడ్ స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్, ఉదయసింహలు కృష్ణకీర్తన్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే కృష్ణకీర్తన్ తన తండ్రి వేం నరేందర్‌రెడ్డి బాటలో ఏసీబీ విచారణకు హాజరవుతారా, లేక తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు మాదిరిగా అజ్ఞాతంలోకి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. నివేదికే కీలకం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకంగా మారుతోంది. కేసులో రెండో నిందితుడు సెబాస్టియన్ ఫోన్లో కొన్ని కాల్స్ రికార్డ్ అయ్యాయి. వాటిని ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించి ఒక నివేదికను అందజేసింది. దీని నుంచి ఏసీబీకి కొంత కీలక సమాచారం లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే సండ్రకు మొదట సీఆర్పీసీ సెక్షన్ 160 (సాక్షి) కింద నోటీసులు జారీచేసిన ఏసీబీ.. తర్వాత నిర్ణయం మార్చుకుని నిందితుడిగా పేర్కొంటూ 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చింది. సెబాస్టియన్, సండ్రల మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా ఏసీబీ దర్యాప్తు సాగుతోంది. అయితే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముగ్గురు (రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ) కూడా ఈ వ్యవహారంలో సండ్ర పోషించిన పాత్రపై తమ కస్టడీలో చెప్పకపోవడం పట్ల ఏసీబీ అనుమానిస్తోంది. సండ్ర, సెబాస్టియన్ల ఫోన్ సంభాషణల ద్వారా కొత్తగా వెలుగులోకి వచ్చిన జనార్దన్‌పై దృష్టి కేంద్రీకరించిన ఏసీబీ.. ఒకటి రెండు రోజుల్లో నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తోంది. త్వరలో మరింత మందికి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏసీబీ మరో కోణంపైనా దృష్టి సారించింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం కోసం డబ్బు తీసుకోవడానికి సమ్మతించిన వారినీ విచారించాలని నిర్ణయిం చినట్లు తెలిసిం ది. ఇందులో భాగంగా కొందరు ప్రజాప్రతినిధుల్ని గుర్తించిన ఏసీబీ అధికారులు త్వరలో వారికి నోటీసులు జారీచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొదటగా సండ్రతో ఫోన్ సంభాషణలు జరిపిన ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే ఒకరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. -
వేం నరేందర్ రెడ్డి కుమారుడికి ఏసీబీ నోటీసు
-
వేం నరేందర్‌రెడ్డిని మరోసారి విచారించనున్న ఏసీబీ!
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఆయన్ను మంగళవారం ఏసీబీ విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఓటకు నోటు వ్యవహారంలో గతనెలలో ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వేం నరేందర్ రెడ్డిని జూన్ 17వ తేదీ రాత్రి అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లినా.. తన ఆరోగ్యం బాగోలేదని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి మరుసటి రోజు ఉదయం ఆయన ఏసీబీ మందు హాజరయ్యారు. ఇదిలా ఉండగా, ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమారు ఏడు గంటలపాటు ఆయనను ప్రశ్నించిన అనంతరం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
మళ్లీ విచారణకు వేం నరేందర్ రెడ్డి
-
మళ్లీ విచారణకు వేం నరేందర్ రెడ్డి
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఆయనను ఏసీబీ అధికారులు సోమవారం విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ బుధవారం సుమారు 6 గంటల పాటు విచారణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన ఇవాళ ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏసీబీ విచారణ అంశాలను ఆయన ఈసందర్భంగా చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య శుక్రవారం సాయంత్రంలోపు విచారణకు హాజరు కావల్సి ఉంది. -
చంద్రబాబును కలిసిన వేం నరేందర్ రెడ్డి
-
చంద్రబాబును కలిసిన వేం నరేందర్ రెడ్డి
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థి, వేం నరేందర్ రెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. వేం నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఏసీబీ విచారణ అంశాలను చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ అధికారులు నిన్న వేం నరేందర్ రెడ్డి సుమారు 6 గంటల పాటు విచారణ జరిపిన విషయం తెలిసిందే. కాగా ఆయనను ఏసీబీ ఇవాళ కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేం నరేందర్ రెడ్డితో పాటు ఎంపీ గరికపాటి రాంమోహన్‌రావు కూడా చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు. అంతకు ముందు చంద్రబాబు తన నివాసంలో పోలీసు ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. -
బాబు ఆంతర్యమేమిటి..?
-
బాబు ఆంతర్యమేమిటి..?
* ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఎందుకిస్తామన్నారు? * ‘ఓటుకు కోట్లు’ కేసులో నరేందర్‌రెడ్డిని ప్రశ్నించిన ఏసీబీ * ఒక్క ఎమ్మెల్సీ కోసం ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు * రేవంత్‌రెడ్డి ఆ రూ.50లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు? * మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ పెట్టారు? * ఐదు గంటల పాటు విచారణ.. * తొలుత తనకేం సంబంధం లేదన్న వేం నరేందర్‌రెడ్డి * చివరికి పలు వివరాలు వెల్లడించినట్లు సమాచారం * మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సన్నద్ధం సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని అధికారులు బుధవారం సుమారు 5 గంటల పాటు విచారించారు. ఈ కేసులో నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహల ఫోన్ కాల్‌డేటా, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో బేరసారాల సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటల వీడియో ఫుటేజీలు, ఏసీబీ కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నరేందర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వాస్తవానికి మంగళవారం రాత్రే ఏసీబీ అధికారులు వేం నరేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను ఏసీబీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా కోరారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా బుధవారం వస్తానని ఆయన హామీ ఇవ్వడంతో.. తిరిగి వెళ్లిపోయారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11.30 సమయంలో వేం నరేందర్‌రెడ్డి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై ఆయనను సాయంత్రం 5 గంటల వరకు విచారించిన అధికారులు.. 5.30 గంటల సమయంలో ఇంటికి పంపించారు. విచారణ సందర్భంగా ఈ వ్యవహారంపై వేం నరేందర్‌రెడ్డిని లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు నేతలు పోటీపడ్డా.. మీకే ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబును రేవంత్ ఒప్పించి టికెట్ ఇప్పించడానికి కారణాలేమిటని అడిగినట్లు తెలుస్తోంది. దాంతోపాటు ‘వేం నరేందర్‌రెడ్డికి నేనే ఫైనాన్షియర్‌ని. ఆయనకు పట్టుపట్టి టికెట్ ఇప్పించింది నేనే..’ అని రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌తో చెప్పిన మాటలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహతో నరేందర్‌రెడ్డికి ఉన్న సంబంధాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. టీడీపీ నేతలు టీఆర్ఎస్కు చెందిన ఏయే ఎమ్మెల్యేలతో మాట్లాడారు, ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయాలపైనా నరేందర్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలులో రేవంత్‌తో పాటు ఎవరున్నారని పలుమార్లు అడిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి వ్యాపార లావాదేవీల గురించి ప్రశ్నించిన ఏసీబీ అధికారులు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయించిందెవరని, స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షలు పోను మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ దాచారని ప్రశ్నించినట్లు తెలిసింది. అసలు ఆ రూ.50 లక్షల సొమ్మును రేవంత్ ఎక్కడి నుంచి తెచ్చిచ్చారని గుచ్చిగుచ్చి ప్రశ్నించి నట్లు తెలిసింది. మొత్తంగా కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే శక్తి నరేందర్‌రెడ్డికి లేదన్న స్పష్టతకు వచ్చిన ఏసీబీ అధికారులు... ఎవరి ద్వారా సొమ్ము తెచ్చారనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ‘ఈ డీల్ మీకోసమే జరిగినందున ప్రతి విషయం మీకు తెలిసే ఉంటుంది కదా!..’ అని తరచూ పేర్కొంటూ సమాధానాలు రాబట్టే యత్నం చేశారు. కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీని గెలిపించుకోవడం వల్ల చంద్రబాబుకు ఒనగూరే ప్రయోజనమేమిటని.. స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడుతూ ‘మావాళ్లు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తానని’ బాబు అనడంలో ఆంతర్యం ఏమిటని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై తమ దగ్గరున్న సమాచారాన్ని చెబుతూ.. ఆయా కంపెనీలు, వ్యక్తులకు టీడీపీతో ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు తెలిసింది. దాదాపు 50 నుంచి 60 ప్రశ్నలు అడిగిన ఏసీబీ అధికారుల బృందం... తొలుత తనకేమీ సంబంధం లేదంటూ వేం నరేందర్‌రెడ్డి చెప్పుకొచ్చినా, చివరకు చాలా విషయాలు రాబట్టినట్లు తెలిసింది. అయితే ఈ విచారణకు ముందే వేం నరేందర్‌రెడ్డిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తీసుకెళ్లారని, వైద్యులతో పరీక్షలు చేయించారని ఆయన తరఫు న్యాయవాది చెప్పడంతో నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ సాయంత్రం 5.30 సమయంలో ఆయనను ఏసీబీ అధికారులు వదిలిపెట్టారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఏసీబీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇక సండ్ర వంతు ‘ఓటుకు కోట్లు’ కేసులో సీఆర్పీసీ 160 కింద ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసు ఇచ్చిన ఏసీబీ... ఆయనను ఈనెల 19న సాయంత్రం 5 గంటల లోపు ప్రధాన కార్యాలయంలో విచారణాధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో మరికొందరు టీడీపీ నేతలకూ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిందితుల నుంచి సేకరించిన సమాచారం, వేం నరేందర్‌రెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా సండ్రను ప్రశ్నించే అవకాశం ఉంది. -
ఏసీబీ ఎదుట హాజరైన నరేందర్‌రెడ్డి
-
ఏసీబీ ఎదుట హాజరైన నరేందర్‌రెడ్డి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి నేడు ఏసీబీ అధికారులు హాజయ్యారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు విచారణ కోసం ఆయన బుధవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ముడుపుల వ్యవహారంలో ఆయన పాత్ర, సూత్రధారులు ఎవరు, ఎమ్మెల్యేను కొనేందుకు డబ్బులెవరు ఇచ్చారనే దానిపై నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశముంది. నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన నివాసానికి వెళ్లారు. అయితే గుండె వ్యాధితో బాధపడుతున్నందున ఇప్పుడు రాలేనని ఆయన విజ్ఞప్తి చేయడంతో అధికారులు వెనక్కి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఏసీబీ ఎదుట హాజయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేందర్ రెడ్డి గెలుపు కోసమే బేరసారాలు జరుపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. మరోవైపు టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఈ ఉదయం నరేందర్ రెడ్డిని కలిశారు. ఈ కేసులో మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు. -
ఏసీబీ ఎదుట హాజరుకానున్న నరేందర్‌రెడ్డి
-
టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి ఏసీబీ నోటీసులు
-
'ఓటుకు కోట్లు'లో టీడీపీ ఎమ్మెల్యేకు ఏసీబీ నోటీసులు
-
'రాత్రి రాలేను.. ఉదయం విచారణకు హాజరవుతా'
-
'రాత్రి రాలేను.. ఉదయం నేరుగా విచారణకు హాజరవుతా'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి గంటన్నర వ్యవధిలోనే ఇద్దరు టీడీపీ నేతలకు నోటీసులను అందజేశారు. ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే వేం నరేందర్ రెడ్డి తనకు ఆరోగ్యం బాగోలేదనీ, తాను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పారు. దాంతో తాను ఈ రాత్రి విచారణకు రాలేనని ఏసీబీకి ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా బుధవారం ఉదయం తానే నేరుగా హాజరవతాననీ, ఏం సమాచారం కావాలని అనుకుంటున్నారో, ఆ ప్రకారంగా తాను ఏసీబీకి సహాకరిస్తానని చెప్పినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి తాను సిద్ధమని చెప్పినట్టు తెలిసింది. దాంతో ఈ ఉదయం విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు చెప్పి వెళ్లినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, విచారణకు మాత్రమే హాజరవమన్నారని వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఏసీబీ అధికారులు వెళ్లిన అనంతరం వేం నరేందర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు కాపలా ఏర్పాటు చేసినట్టు సమాచారం. అంతకముందు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటట వీరయ్యను విచారణ అధికారి ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేశారు. సీబీ బృందం హైదర్ గూడలోని టీడీపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నంబర్ 208 (ఇంటికి)కి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. సండ్ర వెంకటట వీరయ్యపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. -
టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి ఏసీబీ నోటీసులు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకోంటోంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు అందిన గంట వ్యవధిలోనే మరో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. మంగళవారం రాత్రి వేం నరేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఇంట్లో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వేం నరేందర్ రెడ్డిని నేరుగా ఏసీబీ అదుపులోకి తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా, అంతకముందు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారణ అధికారి ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొంత మంది టీడీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, నోటీసులు జారీ చేసే అవకాశముందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. -
నలుగురు కావలెను!
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. వేం నరేందర్ రెడ్డిని పోటీలో నిలిపినా గెలిపించుకోవడం ఎలా అనే దానిపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికారికంగానే ఓ ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన నలుగురిని మినహాయిస్తే ఆపార్టీకి 11 మంది మాత్రమే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఐదుగురి మద్ధతు ఉండడంతో సంఖ్య 16కు చేరింది. సాధారణంగా గెలిచేందుకు ఇద్దరైతే సరిపోతుంది. కానీ నలుగురు ఎమ్మెల్యేల మద్ధతు కోసం ఆపార్టీ యువనేత ఒకరు తీవ్రంగా కష్టపడుతున్నారు. నలుగురెందుకు అనుకుంటున్నారా..? టీడీపీకి ఇప్పుడున్న 11 మందిలో ఇద్దరు కారెక్కెందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్త అన్న మాట. కావలసిన నలుగురు ఎమ్మెల్యేలను వెతికే పనిని చంద్రబాబు యువ నాయకుడికి అప్పగించినట్లు సమాచారం. శనివారం చంద్రబాబు నివాసంలో సమావేశమైన టీడీపీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేల లిస్టును బాబుకు అందజేసినట్లు తెలిసింది. ఏదో ‘రకంగా’ ఆ నలుగురిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డికి ఓటేసేలా ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు.