ఓటుకు నోటు వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకోంటోంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు అందిన గంట వ్యవధిలోనే మరో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. మంగళవారం రాత్రి వేం నరేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఇంట్లో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.