చంద్రబాబును కలిసిన వేం నరేందర్ రెడ్డి
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థి, వేం నరేందర్ రెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. వేం నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఏసీబీ విచారణ అంశాలను చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ అధికారులు నిన్న వేం నరేందర్ రెడ్డి సుమారు 6 గంటల పాటు విచారణ జరిపిన విషయం తెలిసిందే.
కాగా ఆయనను ఏసీబీ ఇవాళ కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేం నరేందర్ రెడ్డితో పాటు ఎంపీ గరికపాటి రాంమోహన్రావు కూడా చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు. అంతకు ముందు చంద్రబాబు తన నివాసంలో పోలీసు ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.