మళ్లీ విచారణకు వేం నరేందర్ రెడ్డి
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఆయనను ఏసీబీ అధికారులు సోమవారం విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ బుధవారం సుమారు 6 గంటల పాటు విచారణ జరిపిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆయన ఇవాళ ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏసీబీ విచారణ అంశాలను ఆయన ఈసందర్భంగా చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య శుక్రవారం సాయంత్రంలోపు విచారణకు హాజరు కావల్సి ఉంది.