ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి గంటన్నర వ్యవధిలోనే ఇద్దరు టీడీపీ నేతలకు నోటీసులను అందజేశారు. ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే వేం నరేందర్ రెడ్డి తనకు ఆరోగ్యం బాగోలేదనీ, తాను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పారు. దాంతో తాను ఈ రాత్రి విచారణకు రాలేనని ఏసీబీకి ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.