నోటు కేసుతో తెలుగుదేశం పార్టీ ‘ముఖ్య’ నేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించి తెర వెనక నుంచి వ్యవహారాన్ని నడిపిన పెద్ద తలకాయల గుట్టు రట్టు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సిద్ధమైంది. దొంగ చాటుగా ఈ బాగోతాన్ని నడిపిన నేతలను త్వరలోనే ప్రశ్నించనుంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సంప్రదింపులు జరిపిన టీడీపీ నేతలందరికీ దశలవారీగా నోటీసులు జారీ చేసి నిర్దేశిత సమయానికి విచారణకు హాజరు కావాలని కోరనుంది.