వేం నరేందర్రెడ్డిని మరోసారి విచారించనున్న ఏసీబీ! | ACB to investigate vem narender reddy again tomorrow | Sakshi
Sakshi News home page

వేం నరేందర్రెడ్డిని మరోసారి విచారించనున్న ఏసీబీ!

Published Mon, Jul 6 2015 10:36 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

వేం నరేందర్రెడ్డిని మరోసారి విచారించనున్న ఏసీబీ! - Sakshi

వేం నరేందర్రెడ్డిని మరోసారి విచారించనున్న ఏసీబీ!

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఆయన్ను మంగళవారం ఏసీబీ విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఓటకు నోటు వ్యవహారంలో గతనెలలో ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వేం నరేందర్ రెడ్డిని జూన్ 17వ తేదీ రాత్రి అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లినా.. తన ఆరోగ్యం బాగోలేదని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి మరుసటి రోజు ఉదయం ఆయన ఏసీబీ మందు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా, ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమారు ఏడు గంటలపాటు ఆయనను  ప్రశ్నించిన అనంతరం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement