వ్యక్తిగతంగా హాజరు కండి... స్టీఫెన్ సన్ కు కోర్టు ఆదేశం
హైదరాబాద్ : కోర్టు ధిక్కార అభియోగానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ 30 న వ్యక్తిగతంగా హాజరుకావాలని తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను హైకోర్టు ఆదేశించింది. ఓటుకు నోట్ల కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వేసిన పిటిషన్ ను విచారిస్తున్న న్యాయమూర్తి దానినుంచి తప్పుకోవాలని కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని స్టీఫెన్ సన్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయమూర్తి దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ స్టీఫెన్ సన్ పై కోర్టు ధిక్కార అభియోగంగా పరిగణిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. స్టీఫెన్ సన్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ మత్తయ్య క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అప్పట్లో స్టీఫెన్ సన్ పై నమోదు చేసిన కేసు బుధవారం విచారణకు రాగా స్టీఫెన్ సన్ కోర్టుకు హాజరుకాకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే సెప్టెంబర్ 30 న వ్యక్తిగత హాజరు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఆయనకు బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.