
ఏసీబీకి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక
ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ తుది నివేదిక ఏసీబీకి చేరింది.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ తుది నివేదిక ఏసీబీకి చేరింది. ఏసీబీ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను అధ్యయనం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో మరో రెండు రోజుల్లో ఏసీబీ అధికారులు మరికొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఇదే కేసులో ముఖ్యమైన నేతలు మాట్లాడిన ఫోన్ సంభాషణల రికార్డులు బహిర్గతమయ్యాయి.