'డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి' | AG ramakrishnareddy says that where is the source for money | Sakshi
Sakshi News home page

'డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి'

Published Tue, Jun 30 2015 11:17 AM | Last Updated on Wed, Aug 29 2018 7:31 PM

'డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి' - Sakshi

'డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి'

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై ఏజీ రామకృష్ణారెడ్డి అడిషనల్ కౌంటర్ దాఖలుచేశారు. మొదటగా ముత్తయ్యే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను సంప్రదించారని ఆయన తెలిపారు. ముత్తయ్య రూ. 2 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టిన విషయాన్ని ఏజీ పేర్కొన్నారు. ఈ కేసులో ముత్తయ్య సహా మరికొందరిని విచారించాల్సి ఉందని ఆయన వాదించారు.

బెయిలిస్తే రేవంత్ ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని చెప్పినా, కోర్టు ఆ విషయాన్ని కొట్టిపారేస్తూ బెయిల్ వైపు మొగ్గుచూపింది. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇప్పటికీ తేలాల్సి ఉందని ఏజీ రామకృష్ణారెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement