mutthaiah
-
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది
-
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది: మత్తయ్య
గుంటూరు: ఓటుకు కోట్లు కేసు విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియడం లేదని, ఆ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు హ్యారీ సెబాస్టియన్‌ను కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదని మత్తయ్య పేర్కొన్నారు. వాయిస్ శాంపిల్స్‌కు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) రిపోర్ట్ రావడం మాకు ఆందోళన కలిగించిందని తెలిపారు. ఏకంగా ఒక మంత్రే మమ్మల్ని అవమానిస్తున్నారని మత్తయ్య గుంటూరులో అన్నారు. ఇక భవిష్యత్తులో విపరీత పరిణామాలు ఎదురైతే ఏం చేయాలో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
'డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై ఏజీ రామకృష్ణారెడ్డి అడిషనల్ కౌంటర్ దాఖలుచేశారు. మొదటగా ముత్తయ్యే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను సంప్రదించారని ఆయన తెలిపారు. ముత్తయ్య రూ. 2 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టిన విషయాన్ని ఏజీ పేర్కొన్నారు. ఈ కేసులో ముత్తయ్య సహా మరికొందరిని విచారించాల్సి ఉందని ఆయన వాదించారు. బెయిలిస్తే రేవంత్ ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని చెప్పినా, కోర్టు ఆ విషయాన్ని కొట్టిపారేస్తూ బెయిల్ వైపు మొగ్గుచూపింది. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇప్పటికీ తేలాల్సి ఉందని ఏజీ రామకృష్ణారెడ్డి వివరించారు.