'భత్కల్ అధికారికంగానే భార్యతో మాట్లాడాడు' | jails DG VK singh condemned MLA revanthreddy comments | Sakshi
Sakshi News home page

'భత్కల్ అధికారికంగానే భార్యతో మాట్లాడాడు'

Published Fri, Jul 10 2015 5:26 PM | Last Updated on Wed, Aug 29 2018 7:31 PM

'భత్కల్ అధికారికంగానే భార్యతో మాట్లాడాడు' - Sakshi

'భత్కల్ అధికారికంగానే భార్యతో మాట్లాడాడు'

హైదరాబాద్ : నగరంలోని చర్లపల్లి జైలులో ఫోన్ కాల్కు రూ.25 అన్న ఓటుకు కోట్లు కేసులో నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ ఖండించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతీ ఫోన్ కాల్ను రికార్డు చేస్తామన్నారు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడు యాసిన్ భత్కల్ తన భార్యలో అధికారికంగానే ఫోన్లో మాట్లాడాడని పేర్కొన్నారు. భత్కల్ తప్పించుకుంటాడని వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.

ఖైదీలకున్న ఐదు నిమిషాల ఫోన్ సౌకర్యాన్ని 10 నిమిషాలకు పొడిగించినట్లు తెలిపారు. తెలంగాణ జైళ్లలోని ఖైదీల సంక్షేమం కోసం చేపట్టిన జోవన్జ్యోతి పథకాన్ని వర్తింపచేస్తామని సింగ్ చెప్పారు. భత్కల్ పరారీపై మాకు కేంద్రం నుంచి ఎటువంటి హెచ్చరికలు అందలేదన్నారు. చంచల్గూడ జైలు నుంచి ఏ ఖైదీ తప్పించుకోవడానకి ఆస్కారంలేదన్నారు. చంచల్గూడలో అభివృద్ధి కార్యక్రమాలతో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని సింగ్ చెప్పారు. అదేవిధంగా జైలులో అవినీతి లేకుండా చేశామని డీజీ వీకే సింగ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement