'టీఆర్ఎస్ లో అదిరేలా ఆహ్వానం... ఆ తర్వాతే..' | v hanumantha rao commented on revanth release and DS | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ లో అదిరేలా ఆహ్వానం... ఆ తర్వాతే..'

Published Thu, Jul 2 2015 5:21 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

'టీఆర్ఎస్ లో అదిరేలా ఆహ్వానం... ఆ తర్వాతే..' - Sakshi

'టీఆర్ఎస్ లో అదిరేలా ఆహ్వానం... ఆ తర్వాతే..'

న్యూఢిల్లీ: నిందితుల బెయిల్ షరతులలో ర్యాలీలు, ప్రసంగాలు చేయవద్దని నిబంధనలు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వీ హనుమంతరావు పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయమై న్యూఢిల్లీలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ... కేసు నుంచి నిర్దోషిగా బయట పడినప్పుడే ర్యాలీలు, ప్రసంగాలు చేయాలని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ టీఆర్ఎస్ లో చేరిన వ్యవహారంపై ఆయన స్పందిస్తూ... డీఎస్ కాంగ్రెస్ ను వీడితే పార్టీకి నష్టమేమీ లేదన్నారు. టీఆర్ఎస్లో ఆహ్వానం అదిరేలా ఉంటుందని... ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement