పదవులకోసమే టీఆర్‌ఎస్‌లో చేరాడు | v hanumantha rao fires on d srinivas | Sakshi
Sakshi News home page

పదవులకోసమే టీఆర్‌ఎస్‌లో చేరాడు

Published Sun, Aug 30 2015 4:01 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

పదవులకోసమే టీఆర్‌ఎస్‌లో చేరాడు - Sakshi

పదవులకోసమే టీఆర్‌ఎస్‌లో చేరాడు

డీఎస్‌పై వీహెచ్ ధ్వజం
 సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ బీ-ఫారాలు అమ్ముకున్న చరిత్ర కలిగిన ఏకైక వ్యక్తి డి.శ్రీనివాస్ అని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ తనకేమిచ్చిందన్న డీఎస్ వ్యాఖ్యలపై వీహెచ్ తీవ్రంగా మడ్డిపడ్డారు. పార్టీ నేత మహేశ్‌గౌడ్‌తో కలసి శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తామే గనుక నోరు తెరిస్తే డీఎస్‌కు తీవ్ర ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. పదవులు, పైరవీల కోసమే డీఎస్, టీఆర్‌ఎస్‌లో చేరారని ధ్వజమెత్తారు.

డీఎస్ తీరు చూస్తుంటే రాజకీయాల్లోకి సంపాదించడానికే వచ్చినట్లుందన్నారు. కాంగ్రెస్‌లో ఎకరాల కొద్ది ఆస్తులు దొరకకపోవడం వల్లే టీఆర్‌ఎస్‌లో చేరినట్లుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడంలో డీఎస్ పాత్ర ఏమాత్రం లేదన్నారు. డీఎస్‌కున్న అర్హతలు, స్థాయికి మించి కాంగ్రెస్‌లో ఆయనకు పదవులు దక్కాయన్నారు. సీఎం కేసీఆర్ మెప్పుకోసం కాంగ్రెస్‌పార్టీని విమర్శిస్తే చూస్తూ సహించేదిలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement