
సమాజ్‌వాది పార్టీ కార్యాలయంలో పదవులు చేపట్టిన నేతలతో ముత్తయ్య
మారేడుపల్లి: ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తిగా మారిన జెరూసలేం ముత్తయ్య సికింద్రాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. సమాజ్‌వాది పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌గా తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు నాగలక్ష్మి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లలో సమాజ్‌వాది పార్టీ పోటీకి సిద్ధమని ముత్తయ్య తెలిపారు. వంద సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ 5వ వార్డు జ్యోతి కాలనీలో తెలంగాణ సమాజ్‌వాది పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పార్టీకి సంబంధించిన వివిధ పదవుల్లో నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా ఏఎస్ శ్రీనివాస్, మీడియా కో-ఆర్డినేటర్‌గా జెరూసలేం ముత్తయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లయన్ సీ ప్రాన్సిస్, సెక్రటరీ జనరల్ సుజాన్, ఆర్గనైజర్ చంద్రశే ఖర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.