
'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి'
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఆయన కలిశారు. అగ్రిగోల్డ్ విచారణ ఆలస్యంగా జరుగుతుందని అన్నారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేశారన్న విషయం అందరికీ తెలుసునని తెలిపారు.
'బ్రీఫ్డ్ మీ' అన్న గొంతు చంద్రబాబుదేనని రాష్ట్రంలో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు ప్రధాననిందితుడు రేవంత్రెడ్డిని తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని సీపీఐ రామకృష్ణ విమర్శించారు.