సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో ఒక రోజు ముందే దీపావళి వచ్చిందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి రోజు బడుగు బలహీన వర్గాలకు మంచి కోసమే ఆలోచిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతలో.. మూడు లక్షల 70 వేల మంది బాధితుల కోసం రూ.264 కోట్లు విడుదల చేశారు. రెండో విడతలో రూ.886 కోట్లు విడుదల చేశారు. వైఎస్ జగన్‌పై బాధితులు నమ్మకం ఉంచారు. వారి నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. న్యాయపరమైన ఇబ్బందులు అధిగమించి రూ.1150 కోట్లు విడుదల చేశారు.
చంద్రబాబు ఖాళీ ఖాజానాను సీఎం జగన్ చేతికి ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబుది కోతల ప్రభుత్వం. వైఎస్ జగన్‌ది చేతల ప్రభుత్వం. ఈ నెల 29వ తేదీన అన్ని అగ్రిగోల్డ్ బాధిత సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అగ్రిగోల్డ్ స్కామ్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోకుండా కమిటీలతో చంద్రబాబు కాలయాపన చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కాజేశారు. చంద్రబాబు లోకేష్ సిగ్గుండే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment