
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకం సన్నగిల్లిందని, అందుకే అగ్రిగోల్డ్ బాధితులు ధర్నాలకు దిగుతున్నారని అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. హాయ్‌ల్యాండ్‌ను కొట్టేయటానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ హాయ్‌ల్యాండ్‌ను కాపాడుకుంటామని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం పెడతామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
చదవండి : ‘ఛలో హాయ్‌ల్యాండ్’: కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం..
Comments
Please login to add a commentAdd a comment