ఓట్లకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది కొత్త భాష్యం చెప్పారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే అది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఎమ్మెల్యేలను కొనడం తప్పుకాదన్నట్లు సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదించటం వింతగా ఉందన్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని బొత్స సూటిగా ప్రశ్నించారు.