
'గొంతు నీదని ఒప్పుకో.. కాదంటే విచారణకు సిద్ధంకా'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారానికి సంబంధించి టేప్ లో ఉన్న గొంతు తనదో కాదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. లేదంటే విచారణకు సిద్ధమవ్వాలని సవాలు విసిరారు. చంద్రబాబు తీరు ప్రజలను తప్పు దోవపట్టించేలా ఉందని అన్నారు. ఇప్పుడు సెక్షన్ 8ని అమలు చేయాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. మరోపక్క, వ్యాపం కేసులో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించడం మంచి పరిణామం అని సురవరం అన్నారు.
గవర్నర్ను భర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని చెప్పారు. ఫంకజ్ముండే, వసుంధర రాజే, సుష్మా స్వరాజ్, వ్యాపం కేసులు మోదీ ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనాలని చెప్పారు. ఉత్తరాధిన మత ఘర్షణలకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలను చేర్చడానికి తాము వ్యతిరేకమని సురవరం స్పష్టం చేశారు.