
ఏమీ లేదబ్బా..రొటీన్ మీటింగ్
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన నివేదికతో పాటు ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై తన నివేదికలను గవర్నర్ ఈ సందర్భంగా హోంశాఖకు అందించినట్లు సమాచారం.
రాజ్నాథ్ సింగ్తో నరసింహన్ సమావేశం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది. కాగా రాజ్నాథ్తో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ను భేటీ వివరాలపై మీడియా ప్రతినిధులు అడగగా ఏమీ లేదబ్బా... రొటీన్ మీటింగ్... నథింగ్ సెన్సేషనల్ అంటూ మాట్లాడకుండా వెళ్లిపోయారు. అంతకు ముందు ఆయన హోంశాఖ అధికారులతో భేటీ అయ్యారు.