- ఆడియో, వీడియో రికార్డుల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపుల కాపీలను మూడు సెట్లు అందజేయాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)ని శుక్రవారం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఒరిజినల్ ఆడియో, వీడియో రికార్డులను ఏసీబీ ఇంతకుముందే కోర్టుకు సమర్పించగా.. వాటిని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
అయితే తమ దర్యాప్తు కోసం ఆ రికార్డులను కాపీ చేసి ఇవ్వాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. దాంతోపాటు ఈ రికార్డుల కాపీలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కూడా కోరిన నేపథ్యంలో మూడు సెట్లు సమర్పించేలా ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులను ఆదేశించాలని స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో మూడు సెట్ల ఆడియో, వీడియో రికార్డులు ఇవ్వాలని ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కోర్టు ఆదేశించింది. అయితే ఒక సెట్ రికార్డులను కోర్టు అధికారులు శుక్రవారం ఏసీబీ అధికారులకు అందించారు. అలాగే ఈ హార్డ్‌డిస్క్, సీడీల్లో ఉన్న సమాచారాన్ని నివేదిక రూపంలో ఇచ్చారు.
మరో మూడు సెట్లు ఇవ్వండి
Published Sat, Jun 27 2015 2:58 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement