FSL
-
జత్వానీ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపండి
సాక్షి, అమరావతి: తన ఫిర్యాదు ఆధారంగా సినీ నటి జత్వానీపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె నుంచి స్వాదీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఐపాడ్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపి పూర్తి స్థాయిలో విశ్లేíÙంచి, సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో మంగళవారం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఇప్పుడు అంత సమయం లేనందున విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. అప్పటివరకు జత్వానీ ఫోన్లు, ఉపకరణాల్లో డేటా భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులిచ్చారు. విద్యాసాగర్ తరఫున టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జత్వానీ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకిచ్చేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారని తెలిపారు. వాటిలో చాలా కీలక సమాచారం ఉన్నందున ఎఫ్ఎస్ఎల్కు పంపి పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయించి, ఆ నివేదికను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి ఈ అనుబంధ పిటిషన్‌ను వ్యతిరేకించారు. వాటిలోని డేటాను భద్రపరచాలని హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిందన్నారు. అనుబంధ పిటిషన్ ద్వారా ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతున్నారని తెలిపారు.రిమాండ్‌పై పిటిషన్ విచారణ కూడా 16కి వాయిదా జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనను రిమాండ్‌కు పంపుతూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తదుపరి విచారణను జస్టిస్ జ్యోతిర్మయి ఈ నెల 16కి వాయిదా వేశారు. విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని కోర్టును పట్టుపట్టవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను 16 వరకు పొడిగించారు. కాంతిరాణా, గున్నీ పిటిషన్లపై విచారణ వాయిదా సినీ నటి కాదంబరీ జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పోలీసు అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ, హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 3కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లుకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. ఆయనపై ఈ నెల 3వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘తాత్కాలిక’ తప్పిదం!
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో హడావుడిగా తాత్కాలిక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నిర్మాణాన్ని చేపట్టింది. దీనికోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమరావతికి ఎఫ్‌ఎస్‌ఎల్‌ను మంజూరుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక ఈ తాత్కాలిక ల్యాబ్ నిర్మాణమెందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్‌లో ఉన్న ఎఫ్ఎస్ఎల్ పోలీసుల దర్యాప్తులో ఇతోధిక పాత్ర పోషించింది. అది విభజన చట్టం 10వ షెడ్యూల్లో ఉండటంతో ఇంకా పంపిణీ జరగలేదు. ప్రసుతం ఏపీలో ఐదు రీజినల్ ఎఫ్ఎస్ఎల్ సెంటర్లున్నా హైదరాబాద్‌లోని మెయిన్ ల్యాబ్‌ను కూడా అరకొరగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఉన్న రీజినల్ ఎఫ్ఎస్ఎల్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంకా ‘తాత్కాలికం’ ఎందుకు? కేంద్ర ప్రభుత్వం అమరావతికి కొత్తగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కేటాయించిన నేపథ్యంలో ఇటీవల కొత్తగా చంద్రబాబు సర్కారు చేపట్టిన తాత్కాలిక ఎఫ్ఎస్ఎల్ ఎందుకు.. అనే చర్చ జరుగుతోంది. ఏపీ రాజధాని ప్రాంతంలో తాత్కాలిక ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 13న ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం తొలిదశలో రూ.27 కోట్లు కేటాయించింది. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో తాత్కాలిక ఎఫ్ఎస్ఎల్ కోసం ఐదు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. తొలి మూడు అంతస్తులు పోలీస్ శాఖ అవసరాలకు, పైరెండు అంతస్తులు ఎఫ్ఎస్ఎల్ కోసం కేటాయించారు. దానిలో పరికరాలు (ఎక్విప్మెంట్)కు, సైంటిఫిక్ స్టాఫ్‌కు వేతనం (కన్సాలిడేట్ పే) కోసం ఏడాదికి రూ.1.08 కోట్లు, రికరింగ్ బడ్జెట్‌గా రూ.72 లక్షలు కేటాయించడం గమనార్హం. ఈ నెల 27న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో అంతర్గత భద్రత పథకానికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఏపీ రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని మంజూరుచేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. పోలీసు మౌలిక వసతుల కల్పన, శిక్షణ సంస్థలు, దర్యాప్తు సదుపాయాల నిమిత్తం కేటాయించిన రూ.100 కోట్లలోంచి అమరావతి ఎఫ్ఎస్ఎల్కు నిధులు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో దీని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వెలగపూడి సచివాలయం సమీపంలో మూడెకరాల స్థలం కేటాయించింది. కేంద్ర నిధులు మంజూరయ్యాక రాజధానిలో ఎఫ్ఎస్ఎల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయినా మంగళగిరిలో కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న తాత్కాలిక ల్యాబ్ పనులు జరుగుతూనే ఉండటం గమనార్హం. -
‘ఓటుకు కోట్లు’ కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు ఉచ్చు బిగుసుకుంటోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విదితమే. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియో, ఆడియోలను నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ (ఎఫ్ఎస్ఎల్)కు అందజేశారు. అలాగే కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌తో సండ్ర ఫోన్లో జరిపిన సంభాషణలను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్లేషించింది. టేపులన్నీ నిజమైనవేనని నిర్ధారించినందున వారికి స్వర నమూనా పరీక్షలు నిర్వహించాలని గతంలో ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వర నమూనాలను అసెంబ్లీ అధికారులు గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. వారిరువురితో పాటు సెబాస్టియన్, ఉదయసింహ మీడియాతో మాట్లాడిన టేపులను సైతం ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణకు అందజేయాలంటూ ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. -
మరో మూడు సెట్లు ఇవ్వండి
- ఆడియో, వీడియో రికార్డుల కోసం ఎఫ్ఎస్ఎల్కు కోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపుల కాపీలను మూడు సెట్లు అందజేయాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)ని శుక్రవారం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఒరిజినల్ ఆడియో, వీడియో రికార్డులను ఏసీబీ ఇంతకుముందే కోర్టుకు సమర్పించగా.. వాటిని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే తమ దర్యాప్తు కోసం ఆ రికార్డులను కాపీ చేసి ఇవ్వాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. దాంతోపాటు ఈ రికార్డుల కాపీలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కూడా కోరిన నేపథ్యంలో మూడు సెట్లు సమర్పించేలా ఎఫ్ఎస్ఎల్ అధికారులను ఆదేశించాలని స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో మూడు సెట్ల ఆడియో, వీడియో రికార్డులు ఇవ్వాలని ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కోర్టు ఆదేశించింది. అయితే ఒక సెట్ రికార్డులను కోర్టు అధికారులు శుక్రవారం ఏసీబీ అధికారులకు అందించారు. అలాగే ఈ హార్డ్‌డిస్క్, సీడీల్లో ఉన్న సమాచారాన్ని నివేదిక రూపంలో ఇచ్చారు. -
'ఎలాంటి ఎడిటింగ్ జరగలేదు'
-
'ఎలాంటి ఎడిటింగ్ జరగలేదు'
హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మాట్లాడిన టేపులు అసలువేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నిర్థారించింది. ఈ కేసుకు సంబంధించి తమకు అందిన వీడియో, ఆడియో టేపుల్లో ఎలాంటి ఎడిటింగ్ కానీ, మార్పులుగానీ జరగలేదని ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వీడియో, ఆడియో టేపుల్లోని స్వరాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు చంద్రబాబుతో పాటు నిందితుల స్వర నమూనాలను ఇప్పించాలని కోరుతూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో నిన్న ఎఫ్ఎస్ఎల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాంతో చంద్రబాబు నాయుడుకు ఏ క్షణంలో అయినా స్వర నమూనాలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించే అవకాశ ఉంది. చంద్రబాబు స్వర నమూనాలు తీసుకుని ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఎఫ్ఎస్ఎల్ అధికారికంగా నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయని అంచనా. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబే సూత్రధారి అని ఏసీబీ దర్యాప్తులో నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది కూడా. అయితే తదుపరి పరిణామాల్లో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండకూడదని భావించిన ఏసీబీ అధికారులు.. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవ్వనున్న నివేదిక కోసం వేచి ఉన్నారు. -
చంద్రబాబుకు స్వర పరీక్ష!
-
చంద్రబాబుకు స్వర పరీక్ష!
బాబు సహా నిందితుల స్వర నమూనా ఇప్పించాలని కోర్టులో ఎఫ్ఎస్ఎల్ మెమో ఒక హార్డ్‌డిస్క్, మూడు టేపులు కూడా కావాలని విజ్ఞప్తి రేపో మాపో ఏపీ సీఎం చంద్రబాబు స్వర నమూనా తీసుకోనున్న ఫోరెన్సిక్ ల్యాబ్ తర్వాత 48 గంటల్లోనే తుది నివేదిక ఇచ్చే అవకాశం ఆ వెంటనే బాబు సహా కీలక వ్యక్తులకు నోటీసులు కొద్దిరోజుల్లోనే కేసు కొలిక్కి వస్తుందంటున్న ఏసీబీ వర్గాలు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అందిన మరుక్షణమే ఈ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఈ వ్యవహారంలో తమకు అందిన వీడియో, ఆడియో టేపుల్లోని స్వరాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు చంద్రబాబుతో పాటు నిందితుల స్వర నమూనాలను తీసుకోవాలని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నిర్ణయించింది. వారి స్వర నమూనాలను ఇప్పించాలని కోరుతూ మంగళవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎఫ్ఎస్ఎల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నమూనాలు తీసుకున్న 24 గంటల్లోనే ఎఫ్ఎస్ఎల్ తమ నివేదికను కోర్టుకు అందజేసే అవకాశం ఉంది. ఆ వెంటనే చంద్రబాబు సహా పలువురు ‘కీలక’ వ్యక్తులకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబే సూత్రధారి అని ఏసీబీ దర్యాప్తులో నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది కూడా. అయితే తదుపరి పరిణామాల్లో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండకూడదని భావించిన ఏసీబీ అధికారులు.. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవ్వనున్న నివేదిక కోసం వేచి ఉన్నారు. ఈ వారాంతంలో లేదా వచ్చే వారం ప్రారంభంలో ఫోరెన్సిక్ నివేదిక అందనుంది. టేపుల విశ్లేషణ దాదాపుగా పూర్తి కావచ్చిందని ఫోరెన్సిక్ వర్గాలు ఏసీబీ కోర్టుకు సమాచారం ఇచ్చాయి కూడా. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదికను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న మరుక్షణం సంచలనాలు ఉంటాయని ఏసీబీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఈ కేసు నీరుగారిపోతోందన్న ప్రచారమంతా వదంతులేనని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కీలక ముందడుగు: ఫోరెన్సిక్ ల్యాబ్ తమ తుది నివేదిక ఇవ్వడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు సహా కేసులో నిందితుల స్వర నమూనాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో తమ పరిశీలనకు పంపిన ఆడియో, వీడియో రికార్డింగులకు సంబంధించిన సంభాషణలను విశ్లేషించేందుకు ఆయా వ్యక్తుల స్వర నమూనా (వాయిస్)లను ఇప్పించాలని కోరుతూ ఫోరెన్సిక్‌సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసులో కీలక ముందడుగు పడినట్టయింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు యత్నించిన వ్యవహారానికి సంబంధించి రేవంత్, సెబాస్టి యన్, మత్తయ్యల సంభాషణలతోపాటు స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియోను విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపిన విషయం తెలిసిందే. ఆ ఆడియో సంభాషణలను పోల్చి చూసేందుకు ఆయా వ్యక్తులకు సంబంధించిన స్వర నమూనాలు తప్పనిసరి. ఈ నమూనాలు తీసుకున్న 24 గంటల్లోనే ఎఫ్ఎస్ఎల్ తన నివేదికను కోర్టుకు అందజేసే అవకాశం ఉంది. తమ నివేదికతో పాటు ఒక హార్డ్‌డిస్క్, 3 టేపులనూ కోర్టుకు సమర్పిస్తుంది. ఇందుకోసం ఖాళీ హార్డ్‌డిస్క్, 3 ఖాళీ టేపులను ఏసీబీ నుంచి ఇప్పించాలని ప్రత్యేక కోర్టును ఎఫ్ఎస్ఎల్ కోరింది. తమ విశ్లేషణ కోసం పంపిన హార్డ్‌డిస్క్, సీల్డ్ బాక్స్‌లు తెరిచే టప్పుడు ఏసీబీ అధికారులు ఉండేలా చూడాలని కూడా కోరింది. ఈ పిటిషన్‌పై కోర్టు బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే కొలిక్కి.. ‘ఓటుకు కోట్లు’ కేసు త్వరలోనే కొలిక్కి రానుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేకు రేవంత్ ఇవ్వజూపిన రూ.50 లక్షలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఓ లోక్‌సభ మాజీ సభ్యుడిని విచారించాలని, అంతకన్నా ముందు వారి నుంచి డబ్బు తీసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉందని పేర్కొన్నాయి. ‘మీరే చూస్తారు. కొద్దిరోజుల్లో మరెన్నో విషయాలు వెలుగు చూస్తాయి..’ అని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేటప్పటికీ 20 మందిని విచారించాలని, వారికి దశల వారీగా నోటీసులు జారీచేసే ప్రక్రియను ఈ వారాంతంలో ప్రారంభిస్తామని ఆ అధికారి తెలిపారు. నోటీసులు అందుకోనున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని సూచనప్రాయంగా చెప్పారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆడియో టేపులు
-
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు 14 ఆడియో, వీడియో టేపులు
ఓటుకు కోట్లు కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. రెండు సెల్ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్‌కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్‌కు పంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్‌కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 14 ఆడియోలో, వీడియో టేపుల్లో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేయనుంది. రెండు రోజుల్లో ల్యాబ్ నిర్ధారించిన అంశాలు ఏసీబీకి, కోర్టుకు చేరనున్నాయి. మరోవైపు ఈ కేసులో కీలక సాక్షి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి కోరింది. శనివారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశాలున్నాయి. సెక్షన్ 164 కింద తీసుకునే ఈ వాంగ్మూలం కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది. తనను ఎవరెవరు ప్రలోభ పెట్టారో, తనతో ఎవరు, ఎన్నిసార్లు మాట్లాడారో, డబ్బు ముట్టజెప్పింది ఎవరో అనే అంశాలను స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి స్టీఫెన్‌సనే ఫిర్యాదు దారు కాబట్టి, ఆయన వాంగ్మూలం కేసుకు అత్యంత కీలకమైనదని న్యాయనిపుణులు చెబుతున్నారు.