ఓ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం చాలా పెద్ద విషయమని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం సాయంత్రమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం పదవిలో ఉన్న వ్యక్తులు ఆడియో, వీడియోలతో సహా దేశంలో ఎక్కడా దొరకలేదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అడ్డంగా దొరికిపోయినా పదవిలో కొనసాగుతున్నారన్నారు. మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ అన్న వాయిస్ తనది కాదని చంద్రబాబు ఇప్పటికీ చెప్పలేదన్న విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నానాతంటాలు పడ్డారని ఆయన అన్నారు.
Published Mon, Mar 6 2017 5:57 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement