తాను ఎలాంటి తప్పు చేయలేదని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. ఏసీబీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నందుకే తనపై కక్ష గట్టి ఏసీబీ కేసులంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు ఇప్పించినందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.