
'చంద్రబాబు పెంపుడు కుక్క రేవంత్'
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు.
కరీంనగర్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్క రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
తెలంగాణ పాలనపై అబద్ధపు ప్రచారం చేస్తే రేవంత్ నాలుక కోస్తామని బాల్క సుమన్ హెచ్చరించారు. చంద్రబాబు అవినీతి ఎండగట్టడమే టీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలైన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర మంత్రులపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బాల్క సుమన్ స్పందించారు.