
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓట్ల కోసం రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది. తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి.. మళ్లీ చిప్పకూడు తినక తప్పదని నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ లోపాయికారిగా బీజేపీకి సహకరిస్తోంది. అమెరికా పర్యటనలో కేటీఆర్ రూ.7500 కోట్ల పెట్టుబడులు తెస్తున్నారు.. లూటీలు చేసేవారికి ఐటీ గురించి ఏం తెలుస్తోంది’’ అంటూ బాల్క సుమన్ దుయ్యబట్టారు.
చదవండి: కేటీఆర్.. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది!: రేవంత్ రెడ్డి