‘రేవంత్‌ రెడ్డి దేశ ద్రోహి’ | Balka Suman Slams TPCC Leaders Over Revanth Reddy Issue | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 1:19 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Balka Suman Slams TPCC Leaders Over Revanth Reddy Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హవాలా దందా చేసి వేల కోట్లు సంపాదించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి దేశ ద్రోహి అంటూ టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్‌ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డిపై ఐటీ దాడుల గురించి ఆయన మాట్లాడారు. తెలంగాణ వనంలో రేవంత్‌ రెడ్డి కలుపు మొక్కని అభివర్ణించారు. ‘ఓటుకు కోట్లు కేసు’లో రేవంత్‌ అడ్డంగా దొరికాడని, అక్కడ దొరికిన 50 లక్షలపై ఆరా తీస్తే డొంకంత కదిలిందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడిచి రేవంత్‌ వేల కోట్లు సంపాదించారన్నారు. దేశ భక్తుడినని చెప్పుకునే ఉత్తమ్‌.. హవాలా మార్గంలో డబ్బులు సంపాదించిన రేవంత్‌ను ఎందుకు సమర్థిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. (రేవంత్‌ ఇంట్లో సోదాలు)

రేవంత్‌ రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్‌ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. రేవంత్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించి రాహుల్‌ గాంధీ తన సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ స్టువర్ట్‌ పురం దొంగల ముఠాగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలవి అని కుంభకోణాలమయమని దుయ్యబట్టారు. 40 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్‌ రెడ్డి మీద సోదాలు జరగడం లేదని.. కేవలం అక్రమంగా సంపాదించిన రేవంత్‌ రెడ్డిపైనే ఐటీ దాడులు జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఐటీ దాడులకు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ స్పష్టం చేశారు. 

చదవండి:

రేవంత్‌కు అరెస్ట్‌ భయం..!

ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement