రేవంత్ నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అవినీతి పాలనను ప్రశ్నించిన వారిని, ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో ఏ-1గా నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, అతని సన్నిహితుల ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జూబ్లిహిల్స్‌లోని రేవంత్ ఇంటికి చేరుకున్న అరుణ ఆయనకు మద్దతుగా నిలిచారు. రాజకీయంగా రేవంత్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే కేసులు పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment