
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ
కొత్తకోట (వనపర్తి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మా పె ద్దన్న అని మాట్లాడిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మరుసటి రోజే మాట మార్చడం సిగ్గుచే టని బీజేపీ జాతీయ ఉపాధ్య క్షురాలు, పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరిక ల అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా అమ లు కాకపోవడంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయా రన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నిక ల్లో మోసం చేసి గెలిచారని దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని, తనను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.