
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విదుత్ కొనుగోళ్లు అంశంపై బహిరంగ చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌పై టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ గురువారం స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి వస్తే బహిరంగ చర్చకు సిద్ధమని బాల్క సుమన్ తెలిపారు.
రేవంత్‌రెడ్డి విలువల్లేని వ్యక్తి అని, ఆయనతో తాము ఎలా బహిరంగ చర్చ జరుపుతామని బాల్క సుమన్ అన్నారు. పట్టపగలు దొంగనోట్లతో దొరికిపోయిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని 'నోటుకు ఓటు' కేసును గుర్తుచేశారు. కరెంటే కాదు రాజీనామాపైనా రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బాల్క సుమన్ మండిపడ్డారు. 24 గంటల కరెంటు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, దమ్ముంటే టీఆర్‌ఎస్ నేతలు ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment