
వారిద్దరితో ఇద్దరు దొంగలు సినిమా చేస్తే...
గుంటూరు : బీజేపీ ప్రత్యేక హోదా సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా... కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు ఎందుకు సన్మానాలు చేయించుకుంటున్నారో అర్థం కావడం లేదని సీపీఐ నేత కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో కె.రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రధాని మోదీని ప్రత్యేక హోదా అడగలేని పిరికి పందలు అంటూ కేంద్రమంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబును ఎద్దేవా చేశారు.
వెంకయ్య, చంద్రబాబును పెట్టి ఇద్దరు దొంగలు సినిమా చేస్తే హిట్ అవుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టీడీపీ - బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామకృష్ణ తెలిపారు.